Top News

మహా కుంభమేళా 2025

 

మహా కుంభమేళా - ప్రపంచంలోనే గొప్ప ఆధ్యాత్మిక మహోత్సవం:



మహా కుంభమేళా జరుపుకోడానికి చాలా కథనాలు వున్నాయి. అందులో ఒకటిక్షీర సాగర మథనం 

క్షీరసాగర మధనం జరిగేటప్పుడు అమృతం కింద పడకుండా చంద్రుడు కాపాడుతాడు, కలశం పగిలిపోకుండా సూర్యుడు కాపాడుతాడు, బృహస్పతి కలశం రాక్షసులకు చెందకుండా కాపాడుతాడు. ఇలా 12 రోజులు పాటు జరిగింది.  మానవుల ఒక్క సంవత్సరం దేవతలకు ఒక్కరోజు కాబట్టి, 12 సంవత్సరాలకు ఒకసారి కుంభమేళా జరుగుతుంది. 12 దైవ దినాలు అంటే 12 సంవత్సరాలు అని అర్థం. గురుగ్రహం యొక్క 12 సంవత్సరాల సైకిల్ అనుసరించి కుంభమేళా జరుగుతుంది. విషయంలో చంద్రుడు, సూర్యుడు, బృహస్పతి ఉన్నారు కాబట్టి ముగ్గురు కలిసి కుంభమేళాలను నిర్ణయిస్తారు. ముగ్గురు ఎక్కడ ఎప్పుడు కలుస్తారు అనే కాంబినేషన్ బట్టి ప్రదేశానికి కుంభమేళా జరుగుతుంది.

 

  •        ఒకటి సూర్యుడు మేషరాశిలో, గురువు కుంభరాశిలో ఉన్నప్పుడు హరిద్వార్ లో గంగా నది తీరాన  కుంభమేళా జరుగుతుంది.
  •        అలాగే గురువు మేషరాశి కి అంటే సూర్యచంద్రులు మకర రాశిలో చేరినప్పుడు త్రివేణి సంగమమైన ప్రయాగ్రాజ్ లో కుంభమేళా జరుగుతుంది.
  •       అలాగే సూర్యుడు, గురువు సింహరాశిలోకి ప్రవేశిస్తే నాశిక్ లో గోదావరి నది తీరాన కుంభమేళా జరుగుతుంది. అందుకనే కుంభమేళాలను సింహస్త కుంభా అని కూడా పిలుస్తారు.
  •      బృహస్పతి సింహరాశిలో, సూర్యుడు మేష రాశిలోకి చేరినప్పుడు ఉజ్జయినిలో క్షిప్రా నది తీరాన కుంభమేళా జరుగుతుంది. దీన్ని కూడా సింహస్త కుంభ అనే పిలుస్తారు .

 

సూర్యుడు 30 రోజులకు ఒకసారి రాశిని మారుతాడుసూర్యుడు ఒక సైకిల్ ని పూర్తి చేయడానికి ఒక సంవత్సరం పడుతుంది. అందువల్ల 12 సంవత్సరాల ఒకసారి కుంభమేళా జరుగుతుంది.

హరిద్వార్, ప్రయాగ్రాజ్ లో ఆరు సంవత్సరాలకు ఒకసారి అర్థ కుంభమేళా కూడా జరుగుతుంది. ప్రయాగ్రాజ్ లో ప్రతి ఒకటిన్నర నెలకు మాగమేల జరుగుతుంది. ఉత్సవాలకు కూడా సాధుసంతులు వస్తూ ఉంటారు. కానీ నాలుగు చోట్ల జరిగే కుంభమేళాలో 12 సంవత్సరాల ఒక్కసారి జరిగే ప్రయాగ్రాజ్ లో కుంభమేళాయే చాలా ప్రసిద్ధి చెందింది.

For more historical insights, visit this govt official website

అఖాడాలు కుంభకు ఆత్మ లాంటివి, సాధుసంతులు ఎవరైనా సరే ఎక్కడ ఉండి తపస్సు చేసిన తమ తమ సాధనలు కొనసాగించిన 12 సంవత్సరాలకు ఒకసారి ఒకరినొకరు కలుసుకోవడానికి కుంభకు మాత్రం వచ్చి తీరుతారు. ఎందుకు వస్తారు అంటే కేవలం స్నానం చేయడానికి కాదు, 12 సంవత్సరాల లో వారి సాధనలో అనుభవాలు లేదా వాళ్ళు సాధించిన కొత్త విద్యలు లాంటి వాటి గురించి ఒకరికొకరు చర్చించుకుంటారు. వారు నేర్చుకున్నా లేదా పొందిన జ్ఞానాన్ని అక్కడ ప్రతిపాదిస్తారు, వాధ ప్రతివాదాలు చేసి నిర్ధారిస్తారు. దాంతో పాటుగా కల్పవాసం కూడా చేస్తారు. సన్యాసులు, సాధువులు, సంతులు వివిధ అఖాడాలల్లో ఉంటారు.

 

అసలు  అఖాడ ఎలా వచ్చింది అంటే :



నిజానికి అఖాడ అనేది వ్యాయామానికి సంబంధించిన పదం. ఆదిశంకరులు సనాతన ధర్మాన్ని పునఃస్థాపితం చేయడానికి, సనాతన ధ్వజాన్ని మరల ఎగరవేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు వారికి ఒక విషయం అర్థమైంది. కేవలం ఆధ్యాత్మిక శక్తి ,ఆధ్యాత్మిక ప్రచారం చాలవు అనే విషయం వారు అవగాహన చేసుకున్నారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఆలయాల పైన, ధర్మం పైన జరుగుతున్న జరగబోయే దాడులను అడ్డుకోవడానికి కేవలం శాస్త్రవిద్య, ఆధ్యాత్మిక శక్తి మాత్రమే చాలవు ,శస్త్ర విద్య కూడా అవసరం అని ఆయన గమనించారు. శస్త్ర విద్యను అభ్యసించే ఆశ్రమాలను అఖాడాలుగా స్థాపించారు.

సనాతన ధర్మానికి సంబంధించి 13 ప్రధానమైన అఖాడాలు ఉన్నాయి. 13 అఖాడాలలో వివిధ సంప్రదాయాలకు సంబంధించినవి. ఇందులో ఏడు అఖాడాలు సాధుసంతులకు సంబంధించినవి, మూడు అఖాడాలు వైష్ణవ సంప్రదాయానికి సంబంధించినవి, మిగిలిన మూడు అఖాడాలు ఉదాసీన అఖాడాలు అని పిలుస్తారు . అఖాడాలకు వారి పరంపర ఉంటుంది ఇష్టదైవం ఉంటుంది. సనాతన ధర్మానికి సంబంధించిన శ్రీ నిరంజన్ అఖాడాలు, శ్రీ జూనా అఖాడాలు ప్రముఖమైనవి.

శ్రీ నిరంజన్ అఖాడ ఇష్టదైవం - శివపుత్రుడైన షణ్ముఖుడు, శ్రీ జునా అఖాడ ఇష్టదైవందత్తాత్రేయుడుశ్రీ నిరంజన్ అఖాడ ప్రముఖ్ మహా మండలేశ్వర్ శ్రీ కైలాస నందగిరి స్వామి,  అలాగే శ్రీ జునా అఖాడ ప్రముఖ్ మహా మండలేశ్వర్ ఆచార్య అవదేశానందగిరి స్వామీ, అలాగే మరో ప్రముఖ్ అఖాడ- మహా నిర్మాణ అఖాడ ఇష్టదైవం కపిలముని .

 కుంభమేళా తేదీలను నిర్ణయించగానే  మొట్టమొదటల భూమిని  కేటాయించబడుతుంది.

అఖాడాలలో భూమి పూజ చేసి శిబిరాలు నిర్మించుకున్న తర్వాత సాధువులందరూ తమ ధర్మ ధ్వజాలను గాలిలో ఊపుతూ నగర ప్రవేశం చేస్తారు. నగర ప్రజలందరూ శోభయాత్రను దర్శిస్తారు. ధర్మ ధ్వజాలను తమ శిబిరాల్లో 72 అడుగుల స్థాపన చేస్తారు. ధర్మ ధ్వజాలు గాలిలో ఎగురుతూ ఆధ్యాత్మిక ప్రభావాన్ని వెదజల్లుతూ ఉంటుంది అని దీని అర్థం.

అఖాడాలలో ఉచిత భోజన సదుపాయం విశ్రమించడానికి, నిద్రించడానికి ఏర్పాట్లు ఉచితంగా చేస్తారు. ధర్మ ధ్వజాలు గాలిలో ఎగురుతూ ఆధ్యాత్మిక ప్రభావాన్ని వెదజల్లుతూ ఉంటుంది అని దీని అర్థం. అఖాడాలలో ధర్మ ఉపన్యాసాలు ఉంటాయి, శాస్త్ర చర్చలు జరుగుతాయి, యోగ విద్య నేర్పించబడుతుంది.

ఇక్కడ ప్రత్యేక దినాల్లో చేసే స్నానాన్ని సాహిస్నానము అని, రాజయోగ స్నానం అని పిలుస్తారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి మహాకుంభమేళాలో 26 శివరాత్రి పర్వదినం నాడు వేలమంది ఇక్కడ సన్యాస దీక్ష తీసుకొని సన్యాస జీవనానికి నాంది పలుకుతారు. కేవలం కుంభకు వెళ్లి స్నానం చేయడం వల్ల మన పాపాలు పోవు. మనం అక్కడికి వెళ్లి సంపాదించుకోవాల్సింది - జ్ఞానాన్ని ,సాధుసంతులు & సాధకులు  నుండి మనం జ్ఞానాన్ని సమపార్జించుకోవాలి.  

  Madan Gupta provides more insights on Maha Kumbh Mela.



కుంభమేళలో పాల్గొనటం వాళ్ళ కలిగే ఆధ్యాత్మిక ప్రయోజనం

 

మానవ వ్యవస్థ ను అర్ధం చేసుకొని, మానవ శ్రేయస్సు కోసం కొన్ని ప్రదేశాలను గుర్తించారు , అందులో ముఖ్యమైనదినదుల సంగమాలు . రెండు నదులు కలిసే చోట శక్తి ప్రవాహం ఎక్కువ వుంటుంది. అలాంటి ప్రదేశాలలో సాధన చేస్తే ఎక్కువ ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. అలాగే మన శరీరంలో 75% - నీరు. నీరు పంచభూతాలలో ఒకటి అని కూడా మనకి తెలుసు, మానవ వ్యవస్థ పై  నీరు  చాల ప్రాముఖ్యతను పోషిస్తుంది .

గత కుంభమేళా లో చాల అధ్యయనాలు కూడా జరిగాయి. వాళ్లు కూడా ఏం చెప్పారంటే 48 రోజులు అక్కడ ఉండి రోజు స్నానం చేసిన వారిలో అద్భుతమైన మార్పులు వచ్చాయని చెప్పారు. సాధన చేస్తూ చేస్తే ఇంకా మంచి ఫలితాలు వస్తాయని చెప్తున్నారు. మనకి  48 రోజులు అక్కడ ఉండటం అంటే కష్టం ,కానీ సుమారు 3 నుండి 7 రోజులు అయినా ఉంటే సాధన చేస్తే  కొంచెమైనా ప్రయోజనం వస్తుందని Isha founder సద్గురు చెప్పారు .

 

 



 

కొత్తది పాతది